‘ పొదుపు ‘ చాలా సులువుగా . . .

అసలు పొదుపు అంటే ఏమిటి ? డబ్బుని సులువుగా ఎలా పొదుపు చేయాలి వంటి విషయాలు ఈ రోజు తెలుసుకుందాం.

అందరూ సాధారణంగా సంపాదన మైనస్ ఖర్చు = పొదుపు అని అనుకుంటారు. సరిగ్గా ఇక్కడే అందరూ తప్పు చేస్తారు.

వాస్తవానికి పొదుపు అంటే మనం సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టక ముందే దాచుకునేది మరియు అనవసరపు ఖర్చులు తగ్గించుకోగా మిగిలే డబ్బుని పొదుపు అంటారు.

మీ సంపాదన చేతికి వచ్చినప్పుడు అందరూ ఖర్చుల గురించి ఆలోచిస్తారు.  పాల వాడికి ఎంత ఇవ్వాలి, ఇంటి అద్దె ఎంత కట్టాలి , మొబైల్ ఫోన్ కి రీచార్జ్ ఎంత చేయించాలి, కిరాణా వాడికి ఎంత ఇవ్వాలి అని ఆలోచనలు తో  ఉంటారు.

కాని వీరందరి కంటే ముఖ్యంగా ముందుగా ఆలోచించవలసిన వ్యక్తి ఒకరు ఉంటారు. వారిని మర్చిపోతారు. ఆ ఒకరు ఎవరో కాదు మీరే.  మీరు మొదట గా మీ భవిష్యత్తు గురించి,  మీ మీద ఆధారపడి ఉన్న భార్య , పిల్లలు గురించి , మీరు చెయ్యవలసిన పొదుపు గురించి ఆలోచించాలి. కాని  ఇది తప్ప మిగతావన్ని ఆలోచిస్తారు.

డబ్బు పొదుపు చేయడానికి కావలసిన మొదటి లక్షణం ‘ క్రమశిక్షణ ‘. క్రమశిక్షణ కలిగి ఉంటే డబ్బులు పొదుపు చేయడం చాలా సులువు .

How to save money

పొదుపు చేయడానికి కొన్ని చిట్కాలు:

  • మీ ఇంట్లో డిబ్బి ఒకటి పెట్టుకొని ప్రతిరోజు ఒక సమయానికి ఒక రూపాయి వెయ్యండి. ఇలా చేయడం వలన కోటి రూపాయలు రాకపోయినా,  కోటి రూపాయలతో కూడా కొనలేని క్రమశిక్షణ మీకు అలవాటు పడుతుంది. మిమ్మల్ని చూసి మీ పిల్లలకి కూడా వెలకట్టలేని క్రమశిక్షణ ని నేర్చుకుంటారు.
  • ఒక పుస్తకం పెట్టుకొని ప్రతిరోజు చేసేటటువంటి ఖర్చులను వ్రాయవలెను. ఇలా రాయడం వలన మనకి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది స్పష్టం అవుతుంది. తద్వారా అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చు.
  • ప్రతి నెల ఏమైనా బిల్లులు చెల్లించవలసిన ఉంటే గడువు తేదీ కంటే ముందే చెల్లించండి. దానివలన అదనంగా చెల్లించేటటువంటి ఫైన్ డబ్బుని మనం పొదుపు చేసినట్టే.
  • ఒక సామెత ఉంది – ” అనవసరమైనవి కొనుక్కుంటే, అవసరమైనవి అమ్ముకోవలసి వస్తుంది “ . కాబట్టి ఏదైనా కొనేముందు మీకు ఎంతవరకు ఉపయోగకరం అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
  • మీరు పొదుపు చెయ్యకపోయినా పర్వాలేదు. కాని  అప్పు మాత్రం చెయ్యొద్దు. అప్పు లేనివాడు ధనవంతుడి తో సమానం.
  • అప్పు లేకపోతే మీరు పొదుపు చేసినట్టే. కాని అత్యవసర పరిస్థితుల్లో చేయవలసి వచ్చినప్పుడు ఆలోచించి చేయండి.
  • ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండడమనేది సర్వసాధారణం. బ్యాంకు వారు వేసే అదనపు ఛార్జ్ లు పడకుండా జాగ్రత్త తీసుకోండి.
  • మీకు కలిగే నిజమైన ఆనందానికి , మీ అవసరానికి డబ్బు ని వాడండి . డబ్బు విలువ ని గుర్తించండి . పొదుపు చేయండి .

పొదుపు రేపు మీ అవసరాలకు,  మీ ఆనందానికి, మీ మీద ఆధారపడి ఉన్న వారిని కాపాడటానికి ,  మీకు ఏదైనా ఆపద కలిగినా  ” ఆ పొదుపే నీకు మిత్రుడిగా మారి సహాయపడతాడు “. మరి మీ నేస్తాన్ని కాపాడుకుంటారా . . .

ధన్యవాదములు ,

తెలుగు ఫ్రెండ్ .

error: Content is protected !!