పలకరించండి హాయిగా . . .

  ఎంత ఖచ్చితంగా లెక్కలు వేసుకున్న ఉద్యోగి గా మన ఇంట్లో కన్నా, ఆఫీస్ లో ఉండే సమయమే ఎక్కువ.

అలాంటప్పుడు సహోద్యోగులతో , కార్యాలయంలోని ఇతర సిబ్బందితో మనకున్న స్నేహం –  జీవిత ఆనందాన్ని, పని సామర్థ్యాన్ని పెంచుతుంది.

 సోమవారం రాగానే ఎదుటివారికి మనం అంతకుముందు అప్పగించిన పనుల గురించి  ఆరా తీయడం కాకుండా “హాయ్ గుడ్ మార్నింగ్” అని నవ్వుతూ పలకరించండి.

ఆ చిన్న పలకరింపు ఎదుటి వాళ్లనే కాదు మీ రోజుని చురుగ్గా ఉంచుతుంది.

 మీ పని పూర్తయింది. మీ సహోద్యోగి డెడ్ లైన్ అందుకోలేక సతమతమవుతున్నారు.  వీలైతే ఆ పని అందుకుని సాయం చేయండి.

 కార్యాలయం నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కరే కాకుండా సరదాగా అందరితో కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళండి.

పనిలో పనిగా కలిసి షాపింగ్ చేయడం వంటి వాటి వల్ల మీ ఉద్యోగంలో యాంత్రికత ఉండదు.హుషారుగా  అనిపిస్తుంది.

 చాడీలు చెప్పడం, మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం ప్రతి కార్యాలయంలోనూ ఎంతో కొంత   ఉంటాయి.

సహోద్యోగులతో మూడో వ్యక్తి గురించి ప్రతిసారి ఆరోపణలు చేస్తుంటే ఎవరైనా మీతో స్నేహం చేయడానికి వెనకడుగు వేస్తారు.

కాబట్టి ఎవరి పై కోపం వచ్చినా,  వాళ్లతోనే మాట్లాడండి. మూడో వ్యక్తి  తో అవసరమైతే తప్ప ప్రస్తావించ వద్దు.

error: Content is protected !!