మహిళల ‘రక్షణ ‘ కి . . . టెక్నాలజీ

మహిళలు ని గౌరవించడం మన సంప్రదాయం. వారికి రక్షణ గా, మనుసున్న మనుషులు గా మనం ఉండాలని టెక్నాలజీ కోరుకొంటుంది . టెక్నాలజీ తో పాటు మనం కూడా తోడు ఉండాలని కోరుకొంటూ . . .

ఈ ఆండ్రాయిడ్ అప్ప్స్ మిమ్మల్ని భద్రం గా ఇంటికి చేరుకోవడానికి, ఇంటి దగ్గర ఉన్న మీ కుటుంబ సభ్యులు నిశ్చింతగా ఉండడానికి ఉపయోగ పడతాయి.

Android apps for women’s security

ఈ అప్ప్స్ ని ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఒకసారి చెక్ చేయండి . ఎలా వాడాలి , ఎవరిని ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్టు లో పెట్టుకోవాలి అన్న తదితర అంశాలు చూడండి . ఒకసారి ఇంటి దగ్గర ప్రయత్నించి అన్ని నేర్చుకోండి .

అప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలంటే అప్ పేరు మీద క్లిక్ చేయండి లేదా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

Bsafe

 • బి సేఫ్ అనే ఈ ఆప్ మహిళలకు భద్రత కల్పించడంలో బాగా ఉపయోగపడుతుంది. వాయిస్ అలారం యాక్టివేషన్ మరియు లైవ్ లో ఆడియో మరియు వీడియో రికార్డ్ చేయడం వంటి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.
 • మీరు కేవలం మీయొక్క మాట ద్వారా  ఈ యాప్ ను యాక్టివేట్ చెయ్యొచ్చు. యాక్టివేట్ చేసిన మరుక్షణం మీ యొక్క కుటుంబ సభ్యులకు లేదా మీ స్నేహితులకు ఆడియో మెసేజ్ మరియు మీరు ఉన్నటువంటి ప్రదేశము వెంటనే ఈ యాప్ ద్వారా అందచేయబడతాయి.
 • ఆటోమేటిక్ గా ఆడియో మరియు వీడియో రికార్డు చేయబడి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ వాళ్లకు చేరుతుంది. మీ వాళ్ళు వెంటనే సహాయం చేయడానికి వీలుగా ఈ యాప్ రూపకల్పన చేయడం జరిగింది.

Safetipin

 • మహిళలకు రక్షణ కల్పించడంలో మరొక ముఖ్యమైన యాప్ సేఫ్టీ పిన్.  ఈ యాప్ లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా విశ్లేషించి మీరు ఏ మార్గం ద్వారా గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకుంటారో చూపిస్తుంది.
 • సేఫ్టీ స్కోర్ ఆధారంగా మనం ఆ మార్గంలో ప్రయాణించాలో లేదో నిర్ణయించుకోవచ్చు. సేఫ్టీ పిన్ యాప్ ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయడానికి వీలుగా మీ కుటుంబ సభ్యుల కోసం ఈ యాప్ ని డిజైన్ చేయడం జరిగింది.
 • మీరు సురక్షితం గా లేని  ప్రదేశానికి పొరపాటున చేరినట్లయితే వెంటనే మీ కుటుంబ సభ్యులను ఎలర్ట్ చేస్తుంది.

Shake2safety

 • షేక్ టు సేఫ్టీ యాప్ కూడా మహిళలకు రక్షణ కల్పించే విషయంలో మంచి అప్.
 • ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తుంది.
 • ఫోను ని షేక్ చేయడం లేదా పవర్ బటన్ నాలుగు సార్లు నొక్కడం ద్వారా మీ కుటుంబ సభ్యులకు వెంటనే మెసేజ్ చేరుతుంది.  
 • మీకు ఉన్నటువంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి మెసేజ్ మరియు ఆడియో రికార్డ్ , మీరు ఉన్న ప్రదేశం పంపించి మిమ్మల్ని రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది.

Chilla

 • చిల్లా యాప్ వ్యక్తిగత భద్రత కల్పించడంలో అత్యంత శక్తివంతమైనది.
 • గట్టిగా అరవడం లేదా పవర్ బటన్ ను ఐదు సార్లు నొక్కడం ద్వారా ఈ యాప్ ను యాక్టివేట్ చెయ్యొచ్చు. 
 • మీరు ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశన్ని ఎస్ఎంఎస్ పంపుతుంది. మరియు ఆడియో రికార్డింగ్  తో ఈమెయిల్ పంపబడుతుంది.

Smart 24 x 7

 • స్మార్ట్ 24 x 7 యాప్ మహిళలను కాపాడడంలో చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది.
 • మీకు ఆపద కలిగినప్పుడు వెంటనే మీ జీపీఎస్ లొకేషన్ ని  మీ స్నేహితులకు అందిస్తుంది .
 • GPRS పనిచేయకపోతే ఎస్ఎంఎస్ ద్వారా ఎలర్ట్ పంపబడుతుంది .

Telltail

 • టెల్ టైల్  అనే అప్ మహిళలకు రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతుంది.
 • ఈ యాప్ కూడా ఎస్ఎంఎస్ పంపించడం , ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఫోన్ నెంబర్లకు వెంటనే హెచ్చరికలు జారీ చేయడంలో బాగా పనిచేస్తుంది.

Eyewatch SOS for Women

 • ఈ యాప్ మీరు ఉన్నటువంటి పరిస్థితులను కేవలం 60 సెకండ్లలో, మీరు ఉన్న ప్రదేశం ఫోటోలు మరియు ఆడియో,  వీడియో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి పంపించబడతాయి

వీటితో పాటు మరి కొన్ని ఉన్నాయి . వీలు అయితే ప్రయత్నించండి . చాలా వరకు పైన చెప్పినవి సరిపోతాయి . ఇంకా కావాలంటే కొన్ని … Women’s security, Watch over me app, taxi pixi, himmat, i go safely.

మీ యొక్క స్నేహితులుకి , బంధువులుకి , కుటుంబ సభ్యులు కి మీకు నచ్చితే షేర్ చేయండి .

ధన్యవాదములు ,

తెలుగు ఫ్రెండ్ .

error: Content is protected !!