నువ్వు . . . నవ్వాలి నీ కోసం . . .

” నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం ” అన్నారు సినీ రచయిత జంధ్యాల గారు. ఈ రోజు ఆ నవ్వు గురించి సరదాగా నవ్వుతూ కాసేపు మనం మాట్లాడుకుందాం. కొంచెం నవ్వుతూ చదవండి ప్లీజ్ …

ఈ భూమి మీదకి వస్తూనే నువ్వు ఏడుస్తూ ఒకరిని నవ్వేలా చేసి ఆమె అప్పటివరకు భరించే నొప్పులు , బాధలు అన్ని మరచిపోయేలా చేసి ఆనందపరుస్తావు.

ఆ అమ్మ నవ్వినప్పుడు నీకు తెలియకుండానే అన్ని నెలల చీకటిని మర్చిపోయి నువ్వు నవ్వి , ఒకరికి ఒకరు నీకు నేను ఉన్నాను అని మాట్లాడకుండానే, “చిన్న నవ్వు ” ద్వారా మనుసు తో మాట్లాడుకునే ఆ ఫీలింగ్ ఎవరు మాటలు లో చెప్పలేనిది.

నవ్వు ఎంత బాధ ని అయిన దూరం చేస్తుంది . ఎంత చీకటి ని అయిన మర్చిపోయేలా చేసి వెలుగుని నింపుతుంది .

చిన్న నవ్వు మిమ్మల్ని ఎవరికీ అయిన పరిచయం చేస్తుంది.

‘ Smile ‘ for health and life.

మనకి తెలిసిన వారు కనపడినపుడు మనం అప్రయత్నంగానే నవ్వుతాం ఎలా. మనం ఇద్దరం ఒకరికి ఒకరు తెలుసు కదా అని, నవ్వు తోనే సంభాషిస్తాము .

మనం ఆనందం గా ఉన్నాము అని ఎలా తెలుస్తుంది . మన ముఖం మీద చిన్న చిరు నవ్వు ఉన్నపుడు.

ఎవరిని అయిన మీరు అంటే ఇష్టం అని ఎలా చెప్తారు , నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఎవరికీ అయిన చెప్పాలంటే “మీ మొదటి మాట మీ చిరునవ్వే”.

సినిమా అంటే మన అందరికి ఎందుకు అంత ఇష్టం, సినిమా చూస్తున్నంత సేపు మనం ఆనందం గా ఉంటాము.

ఈ సృష్టి లో వెలకట్టలేని మందు ‘ నవ్వు ‘. మీరు ఎప్పుడు నవ్వుతూ ఆనందం గా ఉంటే, మీరు ఆరోగ్యం గా ఉంటారు కూడా .

మీరు నవ్వుతూ ఆనందం గా ఉంటే మీరు అందంగా కూడా కనిపిస్తారు . నవ్వండి ఒక సారి . . .

జీవితం లో ఏ సమస్య అయిన ” చిన్న నవ్వు ” తో దూరం చేయవచ్చు .

ఎంత దూరమైన వారిని అయిన, ఎంత దూరంగా ఉన్నా దగ్గర చేసేది ” నవ్వు ”

నీ నేస్తం నీ ” చిరు నవ్వు “… మర్చిపోకు నేస్తం

మీరు అందరూ ఎప్పుడు హాయిగా ఆనందం గా , నవ్వాలని కోరుకొంటూ . . .

“నవ్వుతూ బ్రతకాలిరా .. ” ,

మన తెలుగు ఫ్రెండ్ .

error: Content is protected !!