మహిళల కోసం ప్రత్యేకం గా . . .

మహిళల కోసం ప్రభుత్వాలు బ్యాంకులు వివిధ రకాల రాయితీలతో ఆర్థిక భరోసా,  నైపుణ్యాల శిక్షణ అందిస్తున్నాయి. కొన్ని స్కీములు మీకోసం. . .

ముద్ర యోజన స్కీము ఫర్ ఉమెన్ :

వ్యక్తిగతంగా తమ కాళ్లపై తాము నిలబడే అనుకునే మహిళలకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

బ్యూటీ పార్లర్, టైలరింగ్ యూనిట్ లు, ట్యూషన్ సెంటర్ లు . . . వంటి కుటీర పరిశ్రమలకు ఈ పథకం కింద సాయం అందుతుంది.

దీనికి కొలేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. ఇందులోనే మూడు రకాలు ఉన్నాయి.

శిశు :

వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారికి ప్రాథమిక స్థాయిలో అవసరమయ్యే 50 వేల రూపాయలను దీని కింద అందిస్తారు.

కిశోర్ :

ఈ పథకం కింద 50 వేల నుంచి 5 లక్షల రూపాయలు లోపు మొత్తం కొంత కుదురుకున్న వ్యాపారాలకు లభిస్తుంది.

తరుణ్ :

వ్యాపారం విస్తరించాలని అనుకునేవారికి ఈ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు రుణం అందుతుంది.

రుణం అనుమతి పొందాక ఒక ముద్ర కార్డును అందిస్తారు.

క్రెడిట్ కార్డ్ తరహాలో దాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఇందులో రుణం మొత్తంలో 10 శాతం ఉంటుంది.

దీనికి వ్యాపారం ప్రణాళిక, పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ వంటి కొన్ని పత్రాలు అవసరం అవుతాయి

స్త్రీ శక్తి ప్యాకేజ్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ :

దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది.

ఏదైనా వ్యాపారంలో 50 శాతం వాటా ఉన్నప్పుడు

ఈ పథకం ద్వారా రెండు లక్షల రూపాయలకు పైగా రుణం తీసుకున్నప్పుడు . . 0.50 శాతం చొప్పున అందిస్తారు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ లోన్ :

ఇప్పుడిప్పుడే వ్యాపారంలో అడుగులు వేస్తున్న మహిళలకు, రిటైల్ వ్యాపారం విస్తరించాలని అనుకునేవారికి సూష్మ  , ఎం ఎస్ ఎం ఈ రుణాలను అందిస్తుంది. దీనిలో 10.15 శాతం అంతకంటే ఎక్కువ వడ్డీతో ఇస్తుంది.

సెంట్ కళ్యాణి స్కీము :

ఈ పథకాన్ని సెంట్రల్ బ్యాంకు అందిస్తుంది.

కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి, అభివృద్ధి పరుచుకోవడానికి దీనిని అందిస్తున్నారు.

సూష్మ , మధ్యతరహా పరిశ్రమలు లో రాణిస్తున్న మహిళలు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు, రిటైల్, ట్రేడ్, ప్రభుత్వ స్పాన్సర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మహిళలకు లభిస్తుంది.

దీనికి కోలటేరాల్ సెక్యూరిటీ అవసరం లేదు. ప్రాసెసింగ్ ఫీజు అవసరం ఉండదు .

కోటి రూపాయల వరకు ఈ పథకం కింద అందిస్తారు

మహిళ ఉద్యమ్ నిధి స్కీం :

చిన్న తరహా పరిశ్రమలకు చెందిన మహిళలకు పదేళ్ల కాలానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు అందిస్తుంది.

దీనిలో భాగంగా బ్యూటీ పార్లర్లు, డే కేర్ సెంటర్లు, ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు మార్కెట్ రేటు కి అనుగుణంగా పది లక్షల వరకు లోను అందిస్తారు

error: Content is protected !!