మానసిక ప్రశాంతత కోసం . . .

మీ దినచర్య మొదలు కాకముందే ఈ రోజు ఏమి చెయ్యాలని అనుకుంటున్నారో ఆలోచించుకోవడం అవసరం.

మీ పనికి ఒక ప్రణాళిక ఉంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి వీలు అయినంత వరకు పనులు వాయిదా వేసుకోకుండా చూసు కోవాలి.

ఓ పని విషయంలో ఎదురయ్యే అడ్డంకులను అంచనా వేయగలగాలి.

మీరు పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.

అనవసర కాగితాలు , వృధా అనుకున్న ఇతర వస్తువులు తీసివేసి చూడండి మార్పు మీకే కనిపిస్తుంది.

రోజంతా కష్టపడినా తరిగిపోవు. అదేపనిగా పనుల్లో నే ఉండిపోకుండా ప్రతి గంటన్నర లేదా రెండు గంటలకి ఒకసారి విరామం తీసుకోండి .

ఐదు నిమిషాల సేపు పని నుంచి ధ్యాస మళ్లీనా చాలు.

ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే పనిచేసే చోట ఓ పచ్చటి మొక్క , కుటుంబ సభ్యుల ఫోటో వంటివి ఏర్పాటు చేసుకోండి. మనసుకి సాంత్వన కలుగుతుంది.

విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు పని చేయకండి . పొరపాట్లు చేసే అవకాశం బదులుగా కనీసం పావు గంట సేపు విశ్రాంతి తీసుకోవడమే మంచిది.

 

error: Content is protected !!