గురక కు దూరంగా కొన్ని చిట్కాలు . . .

నిద్రలో గురక పెట్టడం చాలా తరచుగా కనిపించే విషయం. ఇది పెద్దవారిలో మరీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది.ఒక్కోసారి పక్కన పడుకునే వారికి ఈ గురక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ఈ గురక,  గురక పెట్టే వారికి  చాలా ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. గురక పెట్టే వారిలో 75శాతం మంది శ్వాసలో అడ్డంకి తలెత్తే సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీంతో రాత్రి పూట చాలా సార్లు నిద్ర నుండి మెలకువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా గురక పెట్టే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

    అయితే కొన్ని జాగ్రత్తలతో గురకను నివారించే వీలుంది. మొట్టమొదటిగా

పక్కకు తిరిగి పడుకోవటం:

వెల్లకిలా పడుకోవడం వల్ల నాలుక వెనుక భాగము అంగిలి గొంతు లోకి జారి పోయే అవకాశం ఉంది. ఇది గురకకు దారి తీస్తుంది.కాబట్టి పక్కకి తిరిగి పడుకుంటే గురక తక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ఇందుకోసం అవసరమైతే శరీరం మొత్తాన్ని చుట్టుకుని ఉండే దిండు ను ఉపయోగించవచ్చు. తలవైపు కాస్త ఎత్తుగా ఉండే మంచం మీద పడుకుంటే శ్వాస సాఫీగా సాగి గురక రాకుండా చూసుకోవచ్చు.

బరువు తగ్గటం: అధిక బరువును తగ్గించుకునే కొందరిలో గురక కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు.అయితే  ఒకవేళ బరువు పెరిగిన తరువాత గురక మొదలైతే మాత్రం అధిక బరువును తగ్గించుకునే అవసరం ఉంది . అలా చేయడం వల్ల గురక తగ్గే అవకాశం ఉంది .

మెడ చుట్టు పక్కల కొవ్వు బాగా పెరిగిపోతే గొంతు లోపలి మార్గము వ్యాసము తగ్గుతుంది. ఇది నిద్రపోతున్నప్పుడు  వదులై గురకకు దారితీస్తుంది.

మద్యానికి దూరం:

మద్యం , మత్తు కారకాల వంటివి విశ్రాంతి సమయంలో గొంతు కండరాలు పటుత్వాన్ని తగ్గిస్తాయి. ఇది గురక రావడానికి కారణం అవుతుంది.

నిద్రపోవడానికి నాలుగైదు గంటల ముందు మద్యం తాగితే గురక మరింత తీవ్రమవుతుంది .

సమయానికి నిద్ర పోవడం :

రాత్రిపూట ఎక్కువసేపు మేలుకొని పని చేయడం అనేది చాలా అలసటకు దారితీస్తోంది. తర్వాత అప్పుడు నిద్ర మరింత గాఢంగా పడుతుంది.ఈ సమయంలో కండరాలు వదులై గురక రావచ్చు.

ముక్కు రంధ్రాలు బిగుసుకు పోకుండా చూసుకోవటం :

ఒకవేళ ముక్కు బిగుసుకుపోవడం వల్ల గురక వస్తుంటే శ్వాస సాఫీగా ఆడేలా చూసుకోవడం చాలా ఉత్తమం.

పడుకోవటానికి ముందు వేడి నీటితో స్నానం చేస్తే ముక్కు  బిగుసుకోవడం తగ్గుతుంది.

అలాగే ముక్కులో వేసుకునే చుక్కల మందు కూడా ఉపయోగపడుతుంది.

దిండు మార్చడం :

పడక గదిలో దిండ్ల లో ఎలర్జీ కారకాలు సైతం గురకకు దోహదం చేయొచ్చు. దిండ్ల లో పేరుకుపోయే తవిటి పురుగులు గొంతులో ఎలర్జీ ప్రతిస్పందన ప్రేరేపించేలా చేస్తాయి.

పగటి పూట బాగానే ఉండి రాత్రిపూట గురక వస్తుంది అంటే ఇలాంటి కారణం ఏమైనా ఉందేమో అని అనుమానించే అవకాశం ఉంది.  ప్రతి ఆర్నెల్లకు దిండ్లు మార్చడం వల్ల ఈ అలెర్జీ కారకాలకు దూరంగా ఉండొచ్చు.

నీటి శాతం  తగ్గకుండా చూసుకోవటం :

శరీరంలో నీటి శాతం తగ్గిపోతే ముక్కులోని గొంతులోని స్రావాలు చిక్క బడతాయి. ఇది గురక తీవ్రత పెరగడానికి దోహదం చేస్తాయి. కాబట్టి తగినంత నీరు , ద్రవాలు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది.

error: Content is protected !!