పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలోని ఒక పాటను ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేశారు.
పాటలోని సాహిత్యం రామజోగయ్య శాస్త్రి గారు చాలా అద్భుతం గా వ్రాసారు.
ఈ పాట లో స్కెచెస్ తో వేసిన బొమ్మలు చాలా బాగా వేశారు.
కొంతమంది ప్రముఖులైన మహిళా మణులు మదర్ తెరిసా , సరోజినీ నాయుడు, కల్పనా చావ్లా మొదలైన వారిని చూపిస్తూ బాగా డిజైన్ చేశారు.
ఈ పాటలోని సాహిత్యం వ్రాతపూర్వకంగా తెలుగు ఫ్రెండ్ ప్రేక్షకుల కోసం
మగువా మగువా
లోకానికీ తెలుసా
నీ విలువా …
మగువా మగువా
నీ సహానానికి
సరిహద్దులు కలవా …
అటు ఇటు అన్నింటా
నువ్వే జగమంత
పరుగులు తీస్తావు
ఇంటా బయటా
అలుపని రవ్వంత
అననే అనవంట
వెలుగులు పుస్తావు
వెళ్ళే దారంతా
మగువా మగువా
లోకానికీ తెలుసా
నీ విలువా …
మగువా మగువా
నీ సహానానికి
సరిహద్దులు కలావా …
నీ కాటుక కనులు
విప్పారకపోతే
ఈ భూమికి
తెల్లవారదుగా ..
నీ గాజుల చెయ్యి
కదలడాకపోతే
యే మనుగడ
కొనసాగాదుగా …
ప్రతి వరసలోను
ప్రేమ గా
అందుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ
అంచనాలకి అందునా
ఆలయాలు కోరని
ఆదిశక్తి రూపమా
నీవులేని జగతిలో
దీపమే వెలుగున …
నీదగు లాలన లో
ప్రియమగు పాలన లో
ప్రతి ఒక మగవాడు
పసివాడేగా …
ఎందరి పెదవులులో
యే చిరునవ్వున్న
ఆ సిరి మెరుపులకు
మూలం నువ్వే గా …
మగువా మగువా
లోకానికీ తెలుసా
నీ విలువా …
మాగువా మాగువా
నీ సహానానికి
సరిహద్దులు కలవా …