World Mental Health Day జరుపుకుంటున్న సందర్భము గా కొన్ని విషయాలు
మీకోసం తెలుగు ఫ్రెండ్ నుండి.
మీ దినచర్య లో:
దినచర్య మొదలు కాకముందే ఈ రోజు ఏమి చెయ్యాలని అనుకుంటున్నారో ఆలోచించుకోవడం అవసరం.
మీ పనికి ఒక ప్రణాళిక ఉంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి.
మీ దినచర్య ధ్యానం, యోగ, వాకింగ్ వంటి వాటితో మొదలు అవ్వాలి.
మానసికంగా ఆరోగ్యం గా ఉండాలంటే శారీరకంగా కూడ బలం గా ఉండాలి.
అందుకు కావాల్సిన ఆహారం తినాలి మరియు వ్యాయామము చేయాలి.
ఆహారం లో ఆంటి ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలి.
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా తినాలి.
ఆఫీస్ లో ఒత్తిడి ఎదుర్కోవాలి అంటే:
వీలు అయినంత వరకు పనులు వాయిదా వేసుకోకుండా చూసు కోవాలి.
ఓ పనిలో ఎదురయ్యే అడ్డంకులను అంచనా వేయగలగాలి.
మీరు పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.
అనవసర కాగితాలు , వృధా అనుకున్న ఇతర వస్తువులు తీసివేసి చూడండి మార్పు మీకే కనిపిస్తుంది.
అదేపనిగా పనుల్లో నే ఉండిపోకుండా ప్రతి గంటన్నర లేదా రెండు గంటలకి ఒకసారి విరామం తీసుకోండి .
ఐదు నిమిషాల సేపు పని నుంచి ధ్యాస మళ్లీనా చాలు.
ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే పనిచేసే చోట ఓ పచ్చటి మొక్క , కుటుంబ సభ్యుల ఫోటో వంటివి ఏర్పాటు చేసుకోండి. మనసుకి సాంత్వన కలుగుతుంది.
విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు పని చేయకండి .
పొరపాట్లు చేసే అవకాశం బదులుగా కనీసం పావు గంట సేపు విశ్రాంతి తీసుకోవడమే మంచిది.
ఆనందంగా ఉండాలంటే:
ఇష్టమైన కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి.
పుస్తకాలు బాగా చదవండి.
మంచి పుస్తకాలు మన స్నేహితులు.
world mental health day లో మనము భాగస్వామ్యులం అవుదాము.
ఆరోగ్య చిట్కాలు
మనం తీసుకునే ఆహారమే మనకు ఔషదం . కాబట్టి మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఏవి తీసుకుంటే మనకు ఎక్కువ మేలు జరుగుతుందో ఒక సారి చూద్దాం .
పుచ్చకాయలో ఉండే లైకోపీస్ గుండె మరియు చర్మ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
సపోటా పండు రోజు తీసుకుంటే మలబద్ధకం నివారించబడుతుంది.
అనాస పళ్ళలో బ్రోమిలిస్ అనే ఎంజైమ్ వాపులను తగ్గిస్తుంది.
ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.
పచ్చి జామకాయలో ని టానిస్ మాలిక్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగొడతాయి.
ఆహారంలో ఆవాలను భాగంగా చేసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది.
చేపలను తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
పంటి నొప్పికి దాల్చిన చెక్క మంచి ఔషధము.
మునగ రసము, మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
రోజు ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాదు.
మధ్యాహ్న భోజన సమయంలో ఒక గ్లాస్ లస్సి తాగితే మంచిది.
కాలిన గాయాలకు మగ్గిన అరటిపండు గుజ్జును రాస్తే మంట తగ్గి గాయం త్వరగా నయం అవుతుంది.